నా మనసులో ఉన్న బాధ, భయం నా మనసుకే తెలుసు
ఎలా చెప్పుకోవాలో, ఎవరితో చెప్పాలో కూడా తెలీదు
ప్రతీ రాత్రి పొంగే కన్నీటివరదకు తలగడ ఆనకట్టయ్యింది
బాధను బయటపెట్టడం ఇష్టం లేని మనసు చాలా కష్టంగా అదిమిపెట్టింది
ఇక నేను మొయ్యలేనంటూ అనారోగ్యరూపంలో శరీరానికి పంచింది
దశాబ్ధకాలంగా నా జీవితంలో చెలరేగిన పెనుతుఫాను అంతమయ్యింది
అయినా సంతోషమనిపించలేదు...
ఈ కష్టాలు మంచివే... ఎన్నో అద్భుత పాఠాలు నేర్పాయి
గతం గతించింది మర్చిపో అంటారు కానీ నేను మర్చిపోను
నా బతుకు దారిలో గతబాధల గడ్డపారతో వర్తమానంలో గర్వం, అహంకారం లాంటి కలుపుమొక్కలు పెరగకుండా భవిష్యత్ బాటను చదునుచేసుకుంటూ దానికి ఇరువైపులా అందమైన, రంగుల పూల మొక్కలు నాటుతూ ముందుకెళ్తాను.
డిసెంబర్ 06, 2008
గతం గతించింది మర్చిపో అంటారు కానీ నేను మర్చిపోను
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి