ఒక రాజుగారు ఒక రోజు తన తోటలోకి వెళ్ళి చూసేసరికి మొక్కలు, చెట్లు అన్ని వాడిపోయి, ఎండిపోతూ ఉన్నాయట. గేటు దగ్గర నిలుచుని ఉన్న మర్రిచెట్టుని రాజుగారు అడిగారట. ఎందుకలా అయిపోయావని? కొబ్బరి చెట్టు కన్నా నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందట ఆ మర్రిచెట్టు. కొబ్బరిచెట్టేమో తనకి ద్రాక్షపళ్ళు కాయలేదని ఆత్మహత్యకు సిద్ధపడింది. ద్రాక్ష తీగేమో నిటారుగా నిలబడలేననే దిగులుతో కృశించుపోతొంది. బంతిమొక్కేమో తనకి సంపంగి లాంటి వాసన లేదని నిరాహార దీక్షలో ఉంది.
చివరిగా ఒక చోట సన్నజాజి మాత్రం పచ్చగా, నిండుగా కనులవిందుగా కనిపించింది. రాజుగారన్నాను ‘సన్నజాజి! కనీసం నువ్వన్నా పచ్చగా కళకళలాడుతున్నావు. ఈ తోటలో అన్ని నిస్పృహ చెందిన మొక్కలే కనిపించాయి. నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు సంతోషం అని అన్నారట!
అపుడు సన్నజాజి అందట... రాజా మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలానో లేమే అని బాధపడుతున్నాయి. అయితే నీకు మర్రిచెట్టు కావాలనేగా మర్రిమొక్క నాటావు. ద్రాక్ష కావాలనేగా ద్రాక్ష తీగ నాటావు. సన్నజాజి కావాలనేగా నన్ను నాటావు. అందుచే నేను సన్నజాజిగానే ఉంటాను. మరెవరిలానో లేననే నిరుత్సాహాం నాకెందుకు?
పంతమెందుకు నీ పని నీదే
సృష్టి అంతటిలో ఎవరూ
నీ అంత బాగా ఆ పని చెయ్యలేరు
పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు.
1 comments:
after reading the story about the desires that every one wants to imitate the others, it reminds me one of experienes in life that i always aspire to be some one , or something different but one should realize that man's life transitory and he or she should not get disappointed. one must be happy with what u have and what u are. because ur destiny is alrdy decided by the will of god.
కామెంట్‌ను పోస్ట్ చేయండి