మా అమ్మకు వాళ్ళ అమ్మమ్మ ఈ కధ (అంటే నిజంగానే జరిగింది) చెబితే.... మా అమ్మ మాకు చెప్పింది...
అనగనగా
ఒకసారి తాతయ్యవాళ్ళు చాలా బోలెడు నువ్వులను తెచ్చి ఎండబెట్టారంటా... నువ్వులకు చీమలు పట్టి మెల్లగా మెల్లగా వాటి పుట్టలో చేరవేసుకున్నాయంట.. ఇది ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరూ గమనించలేదు. మగవాళ్ళంతా పొలాలకెళ్ళారంట.
సాయంత్రం మగవాళ్ళు పొలాలనుంచి వచ్చాక ఆడవాళ్ళను ఎండిన నువ్వులను కొలవమంటే... పుట్టెడు నువ్వులు తగ్గాయంట. అంటే తాతయ్యకు ఎన్ని నువ్వులు తెచ్చారో తెలుసు. ఇంక తాతయ్య అమ్మమ్మను బాగా తిట్టారంటా.. ఇన్ని నువ్వులు ఎలా తగ్గాయి? మీరే ఏదో చేసారు అని. పోనీ ఒకవేళ ఎండకు ఎండి తరుగు వచ్చి
పొద్దున బాగా ఎండ కాసింది కదా!! అందువల్ల సాయంత్రం బాగా కుండపోత వర్షం పడిందంట.. చీమ పుట్టలో ఎవరూ వేలయితే పెట్టలేదు కానీ... పాపం ఈ వర్షం నీళ్ళు కొంచెంగా వాటి sweet homeలోకి వెళ్ళాయి.
ఇంక లాభం లేదనుకొని చీమలు వాటి పుట్టలో దాచిన నువ్వులన్నీ బయటకు తేవడం మొదలెట్టాయి. తాతయ్య కూడా ఇన్ని నువ్వులు ఎలా తగ్గాయి అని ఆలోచిస్తూ... ఈ చీమలు నువ్వులను పైకి తేవడం గమనిస్తున్నారంట... తీరా నువ్వులన్నీ పైకి తెచ్చాక కొలిస్తే ఖచ్చితంగా పుట్టెడు ఉన్నాయంట... తాతయ్య ముక్కు మీద వేలేసుకొని చీమలు షహబాస్.. అనుకున్నారంట... ఈ తతంగాన్నంతా ఇంట్లో వాళ్ళను పిలిచి చూపించారంట!! వీటివల్ల పాపం ఇంట్లో ఆడోళ్ళు తిట్లు తిన్నారు..
అది సంగతి కధ కంచికి మనం ఇంటికి...
ఈ కధ చిన్నప్పటి నుండి అపుడపుడు చెబుతూ ఉంటుంది. విన్నదే అయినా వినాలనిపిస్తుంది. మళ్ళీ మాకు దీంట్లో సందేహాలు వస్తాయి... అమ్మ పుట్టెడు అంటే ఎన్ని? అంత ఎక్కువ నువ్వులని మీ తాతయ్య ఆలోచించడానికి అని అడిగితే... అవేవో కొలతలు చెప్పింది... దాన్ని బట్టి చాలా ఎక్కువ అని మాత్రం అర్ధం అయ్యింది. ఓహో అందుకే పుట్టెడు కష్టాలు అంటారేమో?
మనం నలిపితే చచ్చిపోయే చీమ... దానంత బలం రావాడమేంటి అంటే? చీమను చూసారా!! దానికి మించిన బరువును మోసుకెళ్తుంది... అందుకే చీమంత బలం.
చీమను చూసే ఓ రాజు తన బేలతనం వదలి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు... ఈ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది.
5 comments:
వాణి గారూ..
బావుందండీ మీ చీమంత బలం కథ :)
అలాగే మీరు చివర్లో చెప్పిన చీమను చూసి యుద్దానికి వెళ్ళిన రాజు కథను కూడా చెప్పండి నాలాంటి తెలియని వారి కోసం :)
ఈ కధ ఎప్పుడూ వినలేదండి.
రాజుగారి పిల్లలూ, ఏడు చేపలు కధే విన్నాను.
మంచి కధను పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
నాకు గుర్తున్నంతవరకూ
పుట్టెడు అంటే ఇరవై కుంచాలు
ఒక కుంచం = రెండున్నర కేజీలు.
ఆంటీ కదా చాలా బాగుంది నాకు బలే బలే నచ్చేసింది thank you very much
భలేవుందండీ మీ చీమ కథ!! :)
ఆ రాజు కథ కూడా చెప్పేయండి plz!!
మధురవాణిగారు, bhavani గారు Sadhu.Sree Vaishnavi గారు, Raji గారు కధ మీకు నచ్చినందుకు :-)
ఆ రాజుగారి కథ .... మొత్తంగా గుర్తు లేదు... కానీ చీమ వల్ల అతడు నేర్చుకున్న నీతేంటో చెబుతాను.
అనగనగా...
ఒక రాజు గారు యుద్ధంలో ఓడిపోయి శత్రురాజులచేత తరిమికొట్టబడి, పారిపోయి అడవిలో గుహలాంటి ఒక చోట తలదాచుకుంటాడు. అక్కడ ఒక చీమ బియ్యంగింజను పట్టుకొని గోడ పైకి పాకుతుంది. కాస్త దూరం వెళ్ళి కింద పడిపోతుంది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఇలా 16 సార్లో 18 సార్లో ప్రయత్నించి మొత్తానికి ఆ గింజను తన పుట్టలోకి చేరవేసుకుంటుంది. రాజుగారు ఇదంతా గమనిస్తూ.... అనుకుంటారు.. ఒక చిన్న చీమ తిండిగింజ కోసం ఎన్ని సార్లు పడిపోతే మళ్ళీ అన్నిసార్లు ప్రయత్నించి మొత్తానికి విజయాన్ని సాధించింది. కానీ నేను ఇంత పెద్దవాడిని అందునా దేశానికి రాజును ... ఇలా పిరికివాడిగా, దీనంగా ఇక్కడ దాక్కున్నాను. ఇదిసరికాదు... ఎందుకు ఓడిపోయానో లోటుపాట్లేంటో తెలుసుకొని ఎలాగైనా మళ్ళీ నా రాజ్యాన్ని నేను దక్కించుకోవాలి అని తనకు తాను ధైర్యాన్ని నూరిపోసుకుంటాడు..
మళ్ళీ మొత్తానికి ఎలాగో తనవాళ్ళను కలుసుకొని ఆ అడవిలోనే ఒక మంచి సైన్యాన్ని తయారుచేసుకొని యుద్ధానికి వెళ్ళి తన రాజ్యాన్ని దక్కించుకుంటాడు... కధ కంచికి మనం ఇంటికి
కధ అమ్మకు కూడా సరిగ్గా గుర్తులేదు... కానీ మొత్తం కధ భలే ఉంటుంది... అవును ఒక సందేహం కధ కంచికి అని ఎందుకంటారో మీకు తెలుసా? దీని కధ కూడా ఎపుడో విన్నట్టు గుర్తు... మీకేమైనా తెలిస్తే చెప్పండేమ్!!
bhavani గారు
అమ్మ కూడా కుంచాలు అని చెప్పారు కానీ ఒక కుంచానికి ఎన్ని కేజీలో ఆమెకు గుర్తులేదు... సందేహనివృత్తి చేసినందుకు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి