కొంతమంది తప్పు ఉన్నా, లేకున్నా ఇతరులను చీటికి, మాటికి విమర్శించడం.... చేస్తుంటారు. వారు పాపం ఏదో సమస్యల్లో అసంతోషంగా ఉంటారు. ఇతరులు ఆనందంగా ఉంటే భరించలేరు. అపుడు మనం చేయాల్సిన పని - చిరునవ్వుతో ‘నీకు ఏదో సమస్య ఉంది. ఆ సమస్య పరిష్కారం కోసం భగవంతునికి ప్రార్థన చేస్తాను..’ అని వారికి చెప్పటం. వాగ్వివాదం సమస్యను ఎక్కువ చేస్తుంది తప్ప తగ్గించదు. మన సంతోషం నాశనం చేసే శత్రువు నెత్తిన నవ్వుతూ నిప్పులు చల్లాలి. మరి వాగ్వివాదం అంటే అవతలివారు ఒక దోసిలి నిప్పులు చల్లితే మనం రెండు దోసిళ్ళు నిప్పులు చల్లటమన్నమాట. మన సంతోషం, చిరునవ్వు అవతలివారిని అందరి ముందు వెర్రివాళ్ళయ్యేట్టు చేస్తుంది. తానే తప్పుగా ఉన్నట్లు అవతలివారు తమ ప్రవర్తనతో అందరికి చెప్పకనే చెబుతారు.
ఇంకా గట్టిగా చెప్పండి - నీ అసంతోషంతో నాలోని సంతోషాన్ని దోచుకోలేవు. మహాఋషులు మౌనంగా ఉంటారు, మేధావులు మాట్లాడతారు, మూర్ఖులు మాత్రమే వాదిస్తారు. వాదించే అవసరం ఉన్నపుడే అసంతోషం పుడుతుంది. మీ మనసు గదిలోని సంతోషపు వజ్రాన్ని చూసి అసూయపడాలి కానీ, దొచుకోవడానికి వీలుండకూడదు. సంతోషం మనలోనే ఉంది... ఎవరి నుంచో, ఎక్కడ నుంచో రాదు. మీ అసంతోషానికి కారణమయ్యే వారి నాశనానికి మీరు ఎన్నో పధకాలు వేస్తుండవచ్చు. కానీ, వారి నాశనానికి బదులు కానుకలు పంపండి. దాని వల్ల మరోసారి అవతలివారు మిమ్మల్ని బాధపట్టేవిధంగా ఉండరు.
జాయిస్ మేయర్ గారి ప్రసంగం నుంచి గ్రహించడమైనది
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి