మా నాన్నగారు ‘అ’తో మొదలయ్యే అన్ని పేర్లు బాగా వెతికి ఏదైనా కాస్త కొత్తగా ఉన్నది పెడదామనుకున్నారంట!! పాపం చాలా చూశారంట... ఏమీ నచ్చలేదు... అమరావతి అని పెడదామనుకున్నారంట... కానీ అదో ఊరిపేరు కదా. నా కూతురిని పెద్దయ్యాక స్కూల్లో ఏడిపిస్తారేమో అనుకొని వదిలేశారంట..
ఒకసారి మా నాన్నగారు చందమామ కథల పుస్తకం చదువుతుంటే.... మొదటి పేజీలో ‘అమరవాణి’అని హెడ్డింగు పెట్టి కింద రెండు భగవద్గీత శ్లోకాలు ఇచ్చేవాళ్ళంట.. ఆ పేరు చాలా బాగా నచ్చిందంట... అప్పటికే మా బంధువుల్లో ‘అమరవేణి’ అని ఉన్నారు... ‘అమరవాణి’అని పెడదామా లేదా ‘అమరవేణి’ పెడదామా అని బాగా ఆలోచించి.... ఎలాగో మనం పూర్తి పేరుతో పిలవం కదా ... ‘వాణి’ అయితే పిలవడానికి బాగుంటుంది కానీ... ‘వేణి’ అని ఏం పిలుస్తాం... అని ఆఖరికి ‘అమరవాణి’ అని ఖాయం చేసారు...
నేను చిన్నప్పుడు కధల పుస్తకాలు చదివే సమయంలో చందమామలో ‘అమరవాణి’ వెయ్యడం మానేసారు... మళ్ళీ ఈ మధ్య ఓసారి చందమామ కొన్నాను. దాంట్లో ‘అమరవాణి’ వేస్తున్నారు.. భలే అనిపించింది... ఓసారి తడిమాను ఆ పేరుని... దాంతోపాటు మా నాన్నగారు... నా పేరు గురించి ఆయన చెప్పిన కథ గుర్తు వచ్చింది.
నా పేరుకు ఏవో అర్ధాలు చెప్పారు కానీ అది సంతృప్తిగా అనిపించలేదు.. ఓ పరిపూర్ణమైన అర్ధం వచ్చినట్టు అనిపించలేదు. --- అమర అంటే దేవతలు వాణి అంటే భాష అంటే దేవతలు మాట్లాడే భాష... ఇంక అతి తక్కువగా మాట్లాడుతుంది... అని ఇలా ఏవేవో చెప్పారు... but still searching..
అచ్చం నా పేరు లాంటి పేరే పెట్టుకున్నవాళ్ళు నాకెక్కడైనా తారసపడతారేమో చూడాలి, మాట్లాడాలి అని సరదాగా అనిపిస్తుంది. ఎందుకంటే నా వరకు నాకు నాది ఓ ప్రత్యేకమైన, అపురూపమైన, అందమైన పేరు అనిపిస్తుంది... అలాగే నాకు అందరి పేర్లకు ఉన్న అర్ధలేంటో తెలుసుకోవాలంటే ఇష్టం. ఉదహారణకు రాధ అనే పేరు అర్ధం ఏంటి అంటే... ఏముంది కృష్ణుడి ప్రేయసి అంటారు.... కానీ రాధ అనే పేరుకు ఏదో అర్ధం ఉండే ఉంటుంది...
ఏంటి ఈ పేరు, అర్ధాలు అంతా చూసి మీకు కూడా మీ పేరుకు అర్ధం తెలుసుకోవాలి అనిపిస్తుందా?? నా పేరుకు అర్ధం ఏంటో చెప్పి తర్వాత మీ పేరు కోసం ప్రయత్నించండి ;-). ఇప్పటికి కొంతమందికి నా పూర్తి పేరు చెబితే మొదలు (అమర) మాత్రమే విని ఇంక అమరావతి అనే పిలుస్తారు... దయచేసి ఇంత అందమైన పేరుని నాశనం చెయ్యద్దు, వాణి అని పిలవండి చాలు అని చెబుతా...
డిసెంబర్ 01, 2008
నా పేరంటే నాకు చాలా ఇష్టం, కానీ దాని అర్ధం నాకు తెలీదు... మీకేమైనా తెలుసా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 comments:
మీ పేరు పెట్టుకున్న వాళ్ళు మీకు ఆర్కుట్ లో దొరకచ్చు. ఇక పోతే అర్ధం ,ఆకాశ వాణి లాంటిదేమో అని నా అభిప్రాయం...
అమర అంటే ఏనాటికి మరణం లేనిది. వాణి అంటే వాక్కు ,పలుకు,మాట .. సో,అమరవాణి అంటే .. శాశ్వతమయిన మాటలు ... నిజమైన మాటలు .
ఇది సరియిన అర్ధం అనే అనుకుంటున్నా ..
అమరవాణి అంటే నశ్వరమైన మాటన్నమాట.ఎప్పటికీ చావులేనివి గొప్పవీ లేక పవిత్రమైన మాటలని చెబుతారు. ఆవిధంగా మీరు అజరామమైన మాటగవారన్నమాట. పేరు బాగుంది.
mahesh cheppina vivaraNa sariggA vundi. dInike nA vOtu.
అమరావతి అనే పేరుగల అమ్మాయిలు గుంటూరు జిల్లాలో విరివిగా కనిపిస్తారు. అది విడ్డూరమైన పేరేమీ కాదు. తిరుపతి, శ్రీశైలం కన్నా ఇదే బెటర్ కదా ;-)
మీ పేరుకి అర్ధం పైన సుజ్జి, మహేష్ చెప్పేశారు కదా. ఎన్ని రకాల వివరణలిచ్చినా వాటన్నిటి అర్ధమూ అటూ ఇటూగా ఒకటే అవుతుంది - మీ నాన్నగారు మీకు చెప్పిందే.
అందరికి :-)
మహేష్ గారు చెప్పిన అర్ధం బాగా నచ్చింది. సుజ్జిగారు :-)
అబ్రకదబ్రగారు నన్ను అమరావతి అనుకొనే వింతగా చూసేవారు... మా నాన్నకు కూడా :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి