ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మబద్ద రసం పిండి ఒక స్పూన్ తేనె కలిపి త్రాగాలి.
సేవించే విధానం :
రోజుకు మూడు సార్లు త్రాగాలి. కానీ, ఇది త్రాగే ఒక గంట ముందు ఏమి తిని ఉండకూడదు. అలాగే త్రాగిన ఒక గంట తర్వాత కూడా ఏమి తినరాదు.
ఇది మొదలు పెట్టిన మొదటి రోజున ఒక పూట మాత్రమే అంటే ఉదయం పరగడుపున త్రాగాలి.
రెండవ రోజు పైన చెప్పిన విధంగా ఉదయం మరియు రాత్రి త్రాగాలి.
మూడవ రోజు ఉదయం, మధ్యాహ్నం, మరియు రాత్రి త్రాగాలి.
ఉదరంలో ఏమైనా సమస్యలున్నవారు చిన్న గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు నిమ్మబద్ద రసం మరియు సగం స్పూన్ తేనె కలిపి త్రాగవచ్చు.
నీరు మరీ ఎక్కువగా వేడి చేయరాదు... గోరువెచ్చగా మాత్రమే ఉండాలి.
ఏల్చూరి గారి జీ-తెలుగు 9-1-2009 కార్యక్రమం నుంచి సేకరించినది.
జనవరి 09, 2009
పొట్ట తగ్గడం కోసం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 comments:
నిమ్మరసంతో తేనెను కలుపుకొని త్రాగడం వలన శరీరంలోని క్రొవ్వు కరిగింపబడుతుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ త్రాగటం వలన జలుబు, సైనస్, దగ్గు మరియు యితర వ్యాధులనుండి వుపశమనం లభిస్తుంది.
మంచి పోస్ట్ చేశారు.
ధన్యవాదాలు
నిజమా!!! నేను నమ్మ లేక పోతున్నాను. పరిక్షించి చూద్దాం.
ఏమైనా .. విషయం చెప్పినందుకు నెనర్లు.
కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి