నవంబర్ 22, 2008

మలబద్ధకాన్ని నివారించే గులాబి లేహ్యం

కావలసిన పదార్ధాలు
నీడిలో ఎండబెట్టిన గులాబి రేకుల పొడి - 50 గ్రా
సొంఠి పొడి - 50 గ్రా (దోరగా వేయించిన సొంఠిని పొడి చేసుకోవాలి)
సునాముఖి ఆకు పొడి - 50 గ్రా
ఎండు ద్రాక్ష - 50 గ్రా
సైందవలవణం పొడి - 50 గ్రా

తయారుచేసే విధానం
గులాబి రేకుల పొడి, సొంఠి పొడి, సునాముఖి ఆకు పొడి మరియు సైందవలవణం పొడులన్నింటిలో ఎండు ద్రాక్ష వేసి కొంచెం కొంచెం తేనె అందులో కలుపుకుంటూ ముద్దగా నూరుకోవాలి.

సేవించే విధానం
బాగా చిన్నపిల్లలకైతే 1 నుండి 3 గ్రాల వరకు ఇంకాస్త పెద్ద పిల్లలకు 5 గ్రా యుక్తవయసు వారికి 10 గ్రా.... పెద్దలు రెండు, మూడు రోజులకొకసారి విరేచనం అయ్యేవారు 10 నుండి 20 గ్రాముల వరకు తీసుకోని రాత్రి పూట నిద్రపోయే ముందు చప్పరించి తిని మంచినీళ్ళు తాగాలి.

గమనిక
ఇది వేసుకొనేటప్పటికి బోజనం చేసి రెండు గంటలయ్యి ఉండాలి. అంటే రాత్రి 8గం. లకు బోజనం చేస్తే 10 గం.లకు వేసుకోవాలి.

0 comments:

:)) ;)) ;;) :D ;) :p :(( :) :( :X =(( :-o :-/ :-* :| 8-} :)] ~x( :-t b-( :-L x( =))

కామెంట్‌ను పోస్ట్ చేయండి